హనుమాన్ మూవీ నుంచి ‘రఘునందన’ వీడియో సాంగ్ రిలీజ్

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . ఈ చిత్రంలో అమృత అయ్యే హీరోయిన్గా నటించగా ,వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా నుంచి ‘రఘునందన’ వీడియో సాంగ్ రిలీజైంది. థియేటర్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లోని డైలాగ్ బిట్కు తమ అభిమాన హీరోల సీన్స్ జోడిస్తూ ఫ్యాన్స్ వీడియోలు ఎడిట్ చేసిన విషయం తెలిసిందే.

 

సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి చిత్రం అయినా ఈ ఫాంటసీ అడ్వెంచర్ దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news