వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు…వైసీపీపై దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఆ పార్టీ తరుపున ఎంపీగా గెలిచి…అదే పార్టీకి వ్యతిరేకంగా రఘురామ రాజకీయ పరమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోనే ఉంటూ రోజూ రచ్చబండ పేరిట జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక లోక్‌సభలో సైతం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జగన్ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తుందని మాట్లాడారు. తాజాగా అమరావతి రైతుల మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, గాంధేయ పద్ధతిలో రైతులు చేస్తున్న మహాపాదయాత్రను అడ్డుకోవడం అన్యాయమని, హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని రఘురామ అన్నారు.
అయితే వైసీపీతో విబేధించిన దగ్గర నుంచి రఘురామ..వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందుకే రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ఎప్పటికప్పుడు లోక్‌సభ స్పీకర్‌ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆయనపై అనర్హత వేటు వేయడం లేదు. ఆయనకు బీజేపీ మద్ధతు ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి…రఘురామ బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మాట్లాడారు. మొత్తానికైతే రఘురామకు బీజేపీ మద్ధతు ఉందని మాత్రం అర్ధమవుతుంది..మరి ఆయనపై కేసులు ఏం అవుతాయో చూడాలి.