భయంగా బతుకుతున్న జగన్‌..పోటీ చేయడం అవసరమా ? – రఘురామ

-

భయం భయంగా బ్రతుకుతున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమా? అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంటే ఆయనకేమీ రెండు కొమ్ములు నాలుగు చేతులు ఉండవని, ప్రజలకు కనపడని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం అవసరమా? అంటూ నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూడా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పర్యటనలకు వెళ్ళనప్పుడు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకునే వారని గుర్తు చేశారు.

ఆయన కుమారుడైన జగన్ మోహన్ రెడ్డి గారు తండ్రి పంథాను తుంగలో తొక్కినప్పటికీ, అదే పార్టీకి చెందిన తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన 24 గంటల వ్యవధిలోనే ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ గా మార్చి, ప్రజా దర్బార్ నిర్వహించారని, ప్రగతి భవన్ పేరును మార్చి తన పేరు, తన తండ్రి పేరు, తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారి పేరో పెట్టలేదని, ఒక మహనీయుడైన జ్యోతిరావు ఫూలే గారి పేరును పెట్టారని అన్నారు. ప్రజాభవన్ ముందు ఉన్న బారి కేడ్లను తొలగించిన ముఖ్యమంత్రి ఒకవైపు అయితే, మరొకవైపు జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడ, ఏ పర్యటనకు వెళ్ళినా బారి కేడ్లతో పాటు పరదాలు ఉండవలసిందేనని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు. అలాగే ఏపుగా ఎదిగిన చెట్లు నరికి వేయడం తప్పదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version