ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిపై రాజకీయం చాలా రసవత్తరంగా జరుగుతుంది. కొన్నాళ్లుగా సొంత పార్టీ నుంచి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ తరఫున ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ.. రాజధానిపై తీవ్రమైన వ్యకరేకతను వ్యక్త పరుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అమరావతే రాజధానిగా కొనసాగాలని హైకోర్ట్ స్టేటస్ కో ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ విషయంపై ఆర్.ఆర్.ఆర్. తనదైన శైలిలో స్పందించారు.
ప్రభుత్వం అంతగా కోర్టులకు వెళ్తూ కోట్లలో ధనాన్ని వృధా చేస్తుందని మొదలుపెట్టిన ఆర్.ఆర్.ఆర్… అది అంత మంచిది కాదని, జగన్ ప్రభుత్వం ఆడిట్ లెక్కల్లో ఇవన్నీ చూపాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికిప్పుడు జగన్ ప్రభుత్వం అంటే “మా ప్రభుత్వం” సుప్రీంకోర్టుకు వెళ్లినా న్యాయం జరగదని.. ఈ విషయంలో తన మాట నెగ్గితే ప్రభుత్వ న్యాయ సలహాదారుడిని తీసేసి తనను సలహాధారుడిగా పెట్టుకోమని కూడా జగన్ కు ఉచిత సలహా ఇచ్చారు.
ఈ స్థాయిలో వేసేవి వేస్తూనే.. చేసేవి చేస్తూనే… మరో పక్క తాను జగన్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలని మరో 25 సంవత్సరాలైనా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. అసలు ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు.. వైసీపీ ఎంపీ రఘురామరాజుకు గొప్ప టాస్క్ అప్పగించారని.. అది కూడా అమరావతే రాజధానిగా కొనసాగేలా చేస్తే.. కొన్ని కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అందుకోసం ఆర్.ఆర్.ఆర్. తనదైన విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ల మధ్య టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే నిత్యం ఢిల్లీ నుంచి మీడయా మంచి బూస్టింగ్ కూడా ఇస్తున్నారనే విషయం విపరీతంగా వైరల్ అవుతోంది.
అయితే ఆర్.ఆర్.ఆర్. తాజాగా జగన్, దేశంలోనే బెస్ట్ సీఎంలలో 3వ స్థానాన్ని సాధించినందుకు అభినందనలు తెలిపారు. అదే సమయంలా ఎంతో చక్కగా అభివృద్ధి చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కంటే జగన్ 3 స్థానాన్ని కైవసం చేసుకోవడం చాలా అభినందనీయం అని తనదైన శైలిలో అన్నారు. ఏది ఏమైనా… జగన్ పై తనదైన వెట్కారపు ప్రేమ చూపించడంలో ఆర్.ఆర్.ఆర్. పీక్స్ కి చేరిపోతున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!!