అల్పపీడనం కారణంగా తెలంగాణలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం లో అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా మరో మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈరోజు రేపు కోస్తా రాయలసీమ ప్రాంతాలలో జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఈ అల్పపీడన ద్రోణి సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని చెప్పింది. అంతేకాకుండా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు వెళ్లవద్దని సూచించింది. ఇక తెలంగాణలో నిన్న పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురవడంతో జిహెచ్ఎంసి అప్రమత్తమైంది టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ప్రజలకు జాగ్రత్తలు సూచించింది.