దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా నిర్వహించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. పీవీ నరసింహారావు బహుబాషా కోవిదుడు మాత్రమే కాదు, ఆయనో విద్యావేత్త, రచయిత, కళాభిరుచి ఉన్న వ్యక్తి, సంస్కృతి పట్ల గౌరవం ఉన్నవాడు. మనం పీవీ శతజయంతి వేడుకలు నిర్వహిస్తే తెలుగు ప్రజల్లో మన పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు.
My letter to Honourable Chief Minister Shri @ysjagan garu, requesting government to celebrate the birth centenary year of former Prime Minister Of India Shri P. V. Narasimha rao Garu.@AndhraPradeshCM pic.twitter.com/WIM6JfSWZl
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 28, 2020
ప్రధాని పదవిని అలంకరించిన తొలి తెలుగువాడైన పి వి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. తెలంగాణలో పుట్టినా ప్రపంచ దేశాలలో పేరు సంపాదించుకున్న మేధావి పి వి నరసింహారావు. అంతే కాకుండా ఆయన ప్రధాని పదవిలో కొనసాగింది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడుగా. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.