గ్యాంబ్లింగ్​ కేసులో ప్రముఖ నటుడు శ్యామ్ అరెస్ట్..!

-

ప్రముఖ నటుడు శ్యామ్​ను గ్యాంబ్లింగ్​ కేసులో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ‘కిక్​’ సినిమాలో తెలుగునాట ఇతడు గుర్తింపు తెచ్చుకున్నాడు.

Kick sham

ప్రముఖ సినీ నటుడు కిక్ శ్యామ్​ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న ఇతడు.. గ్యాంబ్లింగ్​ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వహిస్తుండటం వల్ల కేసు నమోదు చేశారు.తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన శ్యామ్.. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 చిత్రాలలో నటించారు. ఎక్కువగా దర్శకుడు సురేంద్రరెడ్డి సినిమాల్లో కనిపించారు. ‘కిక్’ పవర్​ఫుల్ పోలీస్ అధికారి కనిపించి, టాలీవుడ్​లో కిక్ శ్యామ్​గా గుర్తింపు తెచ్చుకున్నారు.

 

తెలుగు సినిమాలలో అనేక విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టారు. అల్లు అర్జున్ అన్న గా నటించి రేసుగుర్రం సినిమాలో వైవిధ్యంగా పేరు తెచ్చుకున్నారు. అనేకమంది అగ్రనేతలతో నటించి పలు భాషలలో అందరికీ సుపరిచితులు గా మారారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version