“ఆసియా కప్ 2023” ఇక ఇండియా సొంతమే ?

-

ప్రస్తుతం శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికలుగా ఆసియా కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కప్ ను సొంతం చేసుకోవడానికి శ్రీలంక , ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్య పోటీ ఉండనుంది. అయితే ఇండియా ఇప్పటికే ఫైనల్ కు చేరుకోగా, ఇంకో మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడాల్సి ఉంది. ఇక ఫైనల్ కు చేరే మరో జట్టు ఏదో శ్రీలంక మరియు పాకిస్తాన్ లు ఆడే మ్యాచ్ లో తేలనుంది. ఇక ఇండియా పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్లను చిత్తుచిత్తుగా ఓడించి తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. ఈ మ్యాచ్ లలో ఇండియా ప్రదర్శన చూసిన అనంతరం ఆసియా కప్ ను సాధించుకోవడంలో మరో స్టెప్ మాత్రమే ఉంది. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఇండియా జట్టు చాలా సమతూకంగా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ లో రెచ్చిపోతూ ప్రత్యర్థులకు నిదురలేని రాత్రులను ఇస్తోంది.

బ్యాటింగ్ లో రోహిత్ ఫామ్ లో ఉండగా , కోహ్లీ , ఇషాన్, రాహుల్, గిల్ లు టచ్ లోనే ఉన్నారు. ఇక బౌలింగ్ లో బుమ్రా పరుగులును నియంత్రిస్తుండగా కుల్దీప్ యాదవ్ , జడేజా మరియు సిరాజ్ లు వికెట్లు తీస్తూ ఇండియాను గెలిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version