ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోరఘురామ జోక్యం ఉందా?

-

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కేసు..రోజుకో మలుపు తిరుగుతుంది..ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన రాష్ట్ర పోలీసులు..మరికొందరికి నోటీసులు ఇచ్చారు. ఇదే క్రమంలో బీజేపీలో బడా నేతగా ఉన్న బి‌ఎల్ సంతోష్‌కు సైతం తెలంగాణ సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులని పట్టించుకోకపోవడంతో..కోర్టుకు వెళ్ళి మరోసారి సంతోష్‌కు నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

ఇదిలా ఉండగానే ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఇచ్చి..ఈ కేసుకు సంబంధించి ఏపీకి చెందిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని 41A కింద సీఆర్పీసి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి..100 కోట్ల రూపాయలు సమకూరుస్తానని రఘురామ చెప్పినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే ఏపీకి చెందిన రఘురామ..వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి..అదే పార్టీకి రివర్స్ అయ్యి, ఆ పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

అటు వైసీపీ సైతం..రఘురామకు చెక్ పెట్టాలని చూస్తుంది..ఆయనని ఒకసారి సి‌ఐ‌డి అరెస్ట్ కూడా చేసింది. అప్పుడు తెలంగాణలో ఉన్న రఘురామ అరెస్ట్ అయ్యేలా ..ఇక్కడి పోలీసులు ఏపీ సి‌ఐ‌డి వారికి సహకరించారని రఘురామ ఆరోపణలు కూడా చేశారు. ఇక అరెస్ట్ అయ్యాక సి‌ఐ‌డి పోలీసులు తనని కొట్టారని ఆరోపించారు. తర్వాత బెయిల్ మీడియా బయటకొచ్చి..మళ్ళీ ఓ రేంజ్‌లో వైసీపీపై విరుచుకుపడుతున్నారు.

ఇక ఆయనపై వేటు వేయించాలని వైసీపీ గట్టిగా ట్రై చేస్తుంది. కానీ ఢిల్లీలో రఘురామకు బీజేపీ పెద్దల సపోర్ట్ ఉందని ప్రచారం ఉంది. బీజేపీ నేతలతో రఘురామకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే రఘురామ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇన్‌వాల్వ్ అయ్యారని, రూ.100 కోట్లు సమకూరుస్తానని చెప్పినట్లు సిట్ అనుమానిస్తుంది. ఈ క్రమంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి విచారణలో రఘురామ ద్వారా ఎలాంటి విషయాలు వస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version