తెలంగాణ శాసనసభ సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ఆంక్షలపై చర్చించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం ఆంక్షలతో రాష్ట్ర ఆదాయం రూ.40వేల కోట్లు తగ్గుతోందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మోదీ సర్కార్ తెలంగాణ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తోందని ఆరోపిస్తోంది. అన్ని విషయాలు ప్రజలకు తెలిపేందుకే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్, ప్రశాంత్‌కు ఆదేశాలు జారీ చేశారు.
గత అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు షురూ అవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.