రాహుల్ ఎఫెక్ట్: కాంగ్రెస్‌కు ఊపు అక్కడే..!

-

రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే..తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర…కాశ్మీర్ వరకు కొనసాగింది. ఇక తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీల ముగిసిన యాత్ర ఇప్పుడు  తెలంగాణలో కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ఏపీలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో రాహుల్ యాత్రకు అద్భుత స్పందన వచ్చింది. ఏపీలో కూడా మంచి స్పందన వచ్చింది గాని..ఎక్కువ రోజులు యాత్ర జరగలేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్‌కు స్కోప్ లేదు కాబట్టి.

ఇక తెలంగాణలో అడుగుపెట్టిన రాహుల్‌కు మంచి స్పందన వస్తుంది. కాకపోతే రాహుల్ యాత్ర కొనసాగే ప్రాంతాల్లోనే ఆ ప్రభావం ఉంటుంది తప్ప..రాష్ట్ర వ్యాప్తంగా రాహుల యాత్ర ప్రభావం లేదు. ఎందుకంటే మీడియాలో పెద్దగా ప్రచారం లేకపోవడం, పైగా మునుగోడు ఉపఎన్నిక, టీఆర్ఎస్-బీజేపీల మధ్య నడుస్తున్న వార్‌లో రాహుల్ యాత్ర హైలైట్ కావడం లేదు. కానీ రాహుల్ యాత్ర జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు కాస్త ఊపు కనిపిస్తోంది. ఒకవేళ మునుగోడు ఉపఎన్నిక లేని సమయంలో యాత్ర జరిగే ఉంటే..ఆ ప్రభావం రాష్ట్రమంతా ఉండేది. ఇప్పుడు ఆ ప్రభావం లేదు. పైగా మునుగోడు ఉపఎన్నిక వదిలి..కాంగ్రెస్ నేతలు రాహుల్ యాత్రలో ఉంటున్నారు. దీని వల్ల ఆ పార్టీకి మునుగోడులో ఇబ్బంది అవుతుంది. అసలే అక్కడ టీఆర్ఎస్-బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ రేసులో వెనుకబడి ఉంది. ఏదేమైనా గాని  రాంగ్ టైమ్‌లో రాష్ట్రంలోకి రాహుల్ యాత్ర జరుగుతుందని చెప్పొచ్చు.

పైగా రాహుల్ పాదయాత్ర చేస్తున్నారే తప్ప..ఇక్కడ ఉన్న సమస్యలపై, ప్రత్యర్ధులపై దూకుడుగా విమర్శలు చేయడం లేదు. తెలంగాణలో ఉన్న సమస్యలని అడ్రెస్ చేసి హైలైట్ అవ్వడం లేదు. టీఆర్ఎస్-బీజేపీలని టార్గెట్ చేయట్లేదు. ఏదో టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదనే చెప్పారు తప్ప..టీఆర్ఎస్ వైఫల్యాలపై గళం విప్పలేదు. దీని వల్ల రాహుల్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కనిపించడం లేదు. కొద్దో గొప్పో రాహుల్ యాత్ర చేసే ప్రాంతాల్లో మాత్రం ఉంది.

ReplyForward

Read more RELATED
Recommended to you

Exit mobile version