కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బైక్ రేసర్ అవతారం ఎత్తారు. లడఖ్ పర్యటనలో ఉన్న ఆయన బైక్ పై భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సుకు బయల్దేరారు. ఓ ప్రొఫెషనల్ బైకర్ ఎలాంటి దుస్తులు, ఉపకరణాలు ధరిస్తాడో, రాహుల్ అవన్నీ ధరించి బైక్ రైడింగ్ చేశారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో రాహుల్ బైక్ విహారం అందరినీ విపరీతంగా ఆకర్షించింది.
‘ప్రపంచంలో అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటని నా తండ్రి రాజీవ్ గాంధీ చెప్పేవారు’ అని రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. రాహుల్ గాంధీ బైక్ రైడ్‌కు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. . రాహుల్ కొత్త లుక్‌పై ఆ పార్టీ కార్యకర్తలు, నెటిజన్లు.. సూపర్ సర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ రేసర్‌లా ఉన్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక్కడ బైక్ రైడింగ్ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు ఆయన.