వివాదాస్పద పాస్టర్‌తో రాహుల్ గాంధీ భేటీ.. బీజేపీ ఫైర్

-

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే రాహుల్ టీ షర్ట్‌పై ట్రోల్ చేసిన బీజేపీ తాజాగా మరో విషయంపై విమర్శలకు దిగింది. 150 రోజుల జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ.. శుక్రవారం రోజున తమిళనాడుకు చెందిన వివాదాస్పద కేథలిక్ మత గరువు జార్జ్​ పూనయ్యను కలిశారు. కన్యాకుమారి జిల్లా పులియూర్​కురిచిలోని చర్చిలో కలిసి మాట్లాడారు.

“ఏసు క్రీస్తు కూడా భగవంతుని రూపమే కదా? నిజమేనా?” అని జార్జ్ పూనయ్యను రాహుల్​ అడిగారు. “ఆయనే(ఏసు క్రీస్తు) అసలైన దేవుడు. దేవుడు.. ఒక నిజమైన మనిషిలానే అవతరిస్తాడు. ‘శక్తి’లా కాదు. అందుకే మనం మనిషినే చూస్తాం” అని బదులిచ్చారు పాస్టర్.

వివాదాస్పద పాస్టర్​తో భేటీని భాజపా తప్పుబట్టింది. “మతదురభిమానంతో కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు ఆయన(జార్జ్ పూనయ్య) గతంలో అరెస్టయ్యారు. భారత్​ తోడో(దేశాన్ని విడగొట్టే) శక్తులతో కలిసి భారత్​ జోడో(భారత్​ను ఐక్యం చేసే) యాత్ర చేస్తారా?” అని రాహుల్​ను ప్రశ్నించారు భాజపా అధికార ప్రతినిధి షెహ్​జాద్ పూనావాలా.

Read more RELATED
Recommended to you

Exit mobile version