ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా విజయపధంలో దూసుకుపోయిన రోజులను మనము చూశాము. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని సంక్షేమంతో నింపేశారు. కానీ ఆ తర్వాత జరిగిన సంఘ్టనలు రాష్ట్ర విభజన అంతా ఒక కలలా జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ కొంచెం పర్వాలేదు,. కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు అన్ని స్థానాలలో నిలబడే కాండిడేట్ లు దొరకడం కూడా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వచ్చే ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను పోటీలో నిలపడానికి ఒక మహత్తర ప్లాన్ ను అమలుచేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇబ్దులో భాగంగా తిరుపతి మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఇటీవల రాహుల్ గాంధీని ఏపీలో పాదయాత్రను చేయాలని అడిగారట. ఇందుకు రాహుల్ గాంధీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరి రాబోయే ఎన్నికలకు కొంతకాలమే సమయం ఉన్నందున ప్లాన్ ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసి సీఎంలు అయిన పరిస్థితులు చూశాము. మరి రాహుల్ గాంధీ పాదయాత్ర కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందా ?