Breaking : నేడు ఏపీలో ప్రవేశించనున్న రాహుల్‌ జోడో యాత్ర

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసింది. అయితే.. ఇప్పటికే రాహుల్‌ గాంధీ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. అయితే.. నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించనుంది. ఉదయం 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోకి రాహుల్‌ గాంధీ అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగే రూట్లో ఏర్పాట్లను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్, కేంద్రమాజీమంత్రి జేడీ శీలం, కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కే రాజు, ఏఐసీసీ సెక్రటరీ రుద్రరాజు, ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గురునాథ్ రావు పరిశీలించారు. అనంతపురంలో రాహుల్ గాంధీకి వీరంతా ఘనస్వాగతం పలకనున్నారు. ఏపీలో 5 రోజుల పాటు రాహుల్ జోడో యాత్ర సాగుతుంది. అయితే.. అక్టోబర్‌ 24న తెలంగాణలోకి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రారంభమవుతుంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటి షెడ్యూల్.. ఉదయం 7 గంటలకు కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో పాదయాత్ర మొదలవుతుంది. ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్ద పాదయాత్ర ఆగుతుంది. అక్కడే రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 04.30 గంటలకు పాదయాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 06.30 గంటలకు అనంతపురం జిల్లా ఓబులాపురం గ్రామంలో ఆగుతుంది. రాత్రికి బళ్లారిలోని హలకుంది మఠ్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version