రాహుల్ గాంధీ ఓరుగల్లు ప్రకటన ఓ బూటకం.. కాంగ్రెస్ అంటనే మోసం : కేటీఆర్

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. అక్కరకు రాని చుట్టం..‘మొక్కిన వరమీని వేల్పు మోహరమునదా నెక్కిన బారని గుర్రం..గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!’ అన్న పద్య రీతిలో కాంగ్రెస్ పాలన ఉందంటూ ఎద్దేవా చేశారు.

అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్..మొక్కిన ఒక్క పథకం ఇయ్యని ప్రభుత్వమని కేటీఆర్ సెటైర్లు వేశారు.మోసానికి మారు పేరు కాంగ్రెస్..ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్.. రైతుద్రోహి సీఎం రేవంత్.. రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని ఫైర్ అయ్యారు.
ఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం..అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దమని ధ్వజమెత్తారు. రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం..ప్రచారం రూ.15 వేలు..అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు అని..సిగ్గు సిగ్గు ఇది సర్కారు కాదు..మోసగాళ్ల బెదిరింపుల మేళా అంటూ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version