కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ను అన్ లాక్ చేసింది ట్విట్టర్ సంస్థ. ఢిల్లీలో హత్యాచారానికి గురైన ఒక దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి.. ఆ ఫోటోలను షేర్ చేసినందుకు గానూ… ట్విట్టర్ గతవారం తాత్కాలికంగా బ్లాక్ చేసింది. నిబంధనలను ఉల్లంఘించినందుకే రాహుల్ గాంధీ ఖాతాను బ్లాక్ చేసినట్లు ట్విట్టర్ సంస్థ వెల్లడించింది.
తాజాగా ఆయన ఖాతాను ట్విట్టర్ ఆన్ లాక్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రాహుల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇతర నేతల అందరి ఖాతాలను కూడా ఆన్ లాక్ చేసింది ట్విట్టర్. కాగా.. ట్విట్టర్ చర్యను వ్యతిరేకిస్తూ.. నిన్న రాహుల్ గాంధీ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ విమర్శలు చేసిన.. మరునాడే.. ఆయన అకౌంట్ ను ట్విట్టర్ అన్ లాక్ చేసింది. ఇది ఇలా ఉండగా.. భారత్ ట్విట్టర్ అధినేత అయిన మనీష్ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేసింది ట్విట్టర్.