హత్రాస్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంక ఢిల్లీ నుంచి యూపీకి వెళుతున్న క్రమంలో మొన్న అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వారిని అడ్డుకునేందుకు కార్లను ఆపెయగా రాహుల్, ప్రియాంకలు కార్లు దిగి నడవడం మొదలు పెట్టారు. అయినా పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్‌కు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తోపులాట జరగ్గా రాహుల్ కింద పడిపోయారు.
దీంతో పెను దుమారమే రేగింది. హత్రాస్ పూర్ రేప్ ఘటన కంటే రాహుల్ కింద పడ్డ ఘటన వలన ఇదంతా వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ విమర్శలతో దిగి వచ్చిన యోగి నిన్న కొందరు పోలీస్ అధికారులని సస్పెండ్ చేశారు. ఇక తాజాగా హత్రాస్ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు పోలీసులు అనుమతినిచ్చారు. వీరిద్దరితో సహా మరో ముగ్గురికి కూడా పోలీసులు అనుమతి ఇచ్ఛారు. ఇదే సమయంలో హత్రాస్‌లో 144 సెక్షన్ కొనసాగుతుందని ప్రకటించారు.