బిగ్‌బాస్ ల‌వ‌ర్స్ రాహుల్ – పున్ను పెళ్లి… రాహుల్ పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్

-

తెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్‌బాస్ 3 విన్న‌ర్‌గా ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ విన్న‌ర్‌గా రాహుల్ నిల‌వ‌డంలో మ‌రో కంటెస్టెంట్ పున‌ర్న‌వి పాత్ర ఎంతో కీల‌కం అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రు హౌస్‌లో ఉన్న‌ప్పుడు ఓ జంట‌గా.. అన‌ధికారకార ప్రేమికులుగా బిహేవ్ చేశారు.

నాగార్జున కూడా ఏ మాత్రం స‌మ‌యం దొరికినా ప్రతిసారి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న భావన ప్రేక్షకుల్లో కలిగిస్తూ ఈ ఇద్దరి మధ్య బంధాన్ని లవ్ ట్రాక్‌గా మలిచారు. ఇది నిజం కాక‌పోయినా.. టీఆర్పీ రేటింగుల ట్రిక్స్‌లో భాగ‌మే అయినా వీర‌ద్ద‌రు మాత్రం త‌మ ఎపిసోడ్‌ను బాగా హైలెట్ చేసుకున్నారు. ఇక బ‌య‌ట షో చూస్తోన్న వాళ్ల‌కు సైతం రాహుల్ – పున్ను నిజంగానే ప్రేమించుకుంటున్నారా ? అన్నంత సందేహాలు వ‌చ్చాయి.

పునర్నవి హౌస్‌లో ఉన్నన్నాళ్లు ఓ సోమరిగా.. ఆమెతో తిట్లు తింటూ.. పున్నూ కోసం మాత్రమే ఈ పులిహోర రాజాగా ముద్ర వేయించుకున్న రాహుల్‌లో ఆట‌గాడు ఆమె ఎలిమినేట్ అయ్యాకే బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఇక రాహుల్ బిగ్‌బాస్ విన్న‌ర్ అయ్యాక పున్నూకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఇక రాహుల్ – పున్ను పెళ్లికి ఓకే అంటే తాము పెళ్లి చేసేందుకు రెడీగా ఉన్నామ‌ని రాహుల్ పేరెంట్స్ చెప్ప‌డం విశేషం.

పున్నుకు పార్టీ ఇస్తోన్న క్ర‌మంలోనే వీరిద్ద‌రి పెళ్లిపై రాహుల్ త‌ల్లిదండ్రులు ఓపెన్ కావ‌డంతో ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. మ‌రి ఈ బిగ్‌బాస్ ప్రేమికులు నిజంగానే పెళ్లి పీట‌లు ఎక్కుతారా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version