కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో రాగల రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా ఈనెల 26న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రం లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో రాగల రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ నెల 26 నాటికి ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అధికపీడనం కారణంగా సముద్రం నుండి రాష్ట్రంవైపు తేమ వస్తోంది. దాంతో అనంతపురం చిత్తూరు తో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం కూడా జరిగింది.