తెలంగాణ రాష్ట్రంలో నేడు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్ నుండి విదర్భ మీదగా ఉత్తర తెలంగాణ వరకు 1,500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇదిలా ఉంటే నిన్న కూడా రాష్ట్రం లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. తెలంగాణ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరోవైపు రాష్ట్రంలో చలి ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దట్టమైన పొగ మంచు కప్పుకుంది. నిన్న రంగారెడ్డి లో అత్యల్పంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అంతే కాకుండా పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుండి 5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.