కంగ్రాట్స్ వార్న‌ర్.. మెగా వేలంలో మంచి జరుగుతుంది : ఎస్ఆర్‌హెచ్

-

గ‌త ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ఈ సారి వార్న‌ర్ తో పాటు ర‌షీద్ ఖాన్ లు వంటి కీలక ఆట‌గాళ్ల‌ను స‌న్ రైజ‌ర్స్ రిటైన్ చేసుక‌కుండా జ‌ట్టు నుంచి వ‌దిలించుకుంది. దీంతో స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు కు వార్న‌ర్ గుడ్ బై చెప్పాడు. అయితే ఈ ప్ర‌క్రియ కొన‌సాగిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వార్న‌ర్ పై స‌న్ రైజ‌ర్స్ ఒక్క సారి కూడా స్పందించ‌లేదు. అయితే తాజా గా ఆస్ట్రేలియా జ‌ట్టు యాషెస్ గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ యాషెస్ టోర్నీ లో వార్న‌ర్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. కాగ ఎస్ ఆర్ హెచ్ త‌న ట్వీట్ట‌ర్ అకౌంట్ ద్వారా వార్న‌ర్ కు కంగ్రాట్స్ చెప్పింది.

యాషెస్ గెలిచినందుకు కంగ్రాట్స్ అంటూ పోస్టు చేసింది. తిరిగి ఫామ్ లోకి వ‌చ్చిన‌ట్టు ఉన్నావ‌ని వార్న‌ర్ ను ఉద్ధేశించి ట్వీట్ చేసింది. పార్టీని ఎంజ‌య్ చేయ్.. మెగా వేలంలో నీకు అంతా మంచే జ‌రుగుతుంద‌ని అశిస్తున్నం అంటూ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ట్వీట్ చేసింది. కాగ చాలా రోజుల త‌ర్వాత వార్న‌ర్ గురించి సన్ రైజ‌ర్స్ ట్వీట్ చేయ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశం గా మారింది. అయితే వార్న‌ర్ కు వ‌చ్చే మెగా వేలంలో మంచి ధ‌ర‌తో ఇత‌ర జ‌ట్లు క‌నుగోలు చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version