గత కొన్ని రోజులుగా ఏపీలోని కొన్ని జిల్లాలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వర్షాలు కాస్త భారీ నుండి అతి భారీ వర్షాలుగా మారే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియచేస్తోంది. ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని కొనసాగుతున్న ఆవర్తనం రాబోయే రెండు రోజులలో అల్పపీడనంగా మారి ఉదృతంగా మారనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. కాగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలలో ఒక మోశారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇక మిగిలిన జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండి ? భారీ వర్షాల వలన కలిగే ప్రమాదాలకు దూరంగా ఉంటూజాగ్రత్త వహించాలని కోరుకుంది.