ఈ జిల్లాలో భారీ వర్షాలు…ఎల్లో అలర్ట్.!

-

 

తెలంగాణ ప్రాంత వాసులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. ఈరోజు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని రేపు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

rain ap Telangana
rain ap Telangana

ఈరోజు తెలంగాణలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, భువనగిరి, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, ఉమ్మడి అదిలాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

ఆయా ప్రాంతాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాదులోని కొన్ని ప్రాంతాలలో విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల రాకతో ఈ ప్రాంతాలలో వర్షాలు రెండు రోజులపాటు అధికంగా కురుస్తాయి. వృద్ధులు, చిన్నపిల్లలు వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని బయటకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. అటు ఏపీలో కూడా వర్షాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news