ఏపీని వర్షం ముప్పు వదలడం లేదు. గత నెల కాలం నుంచి వరసగా వాయుగుండాలు, అల్పపీడనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. మునుపెన్నడూ లేనటువంటి వరదలు కరువు సీమ.. రాయలసీయలో వచ్చాయి. దీంతో కడప, అనంతపూర్, చిత్తూర్, నెల్లూర్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. దాదాపుగా 40 పైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉంటే మరో అల్పపీడనం ముంచుకొస్తుంది. నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో మరోసారి ఏపీలో వర్షాలు కురువనున్నాయి. రాయలసీయ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 3 నుంచి ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయిని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో పొడి వాతావరణం ఉండనుంది.