సీఎం కేసీఆర్.. భద్రాచలం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గోదావరి నీళ్లకు శాంతి పూజ చేశారు సీఎం కేసీఆర్. అనంతరం.. ముంపు బాధితులను పరామర్శించారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని ప్రకటన చేశారు. గతంలో కంటే.. కనివినీ ఎరుగని వరదలు వస్తున్నాయని.. 50 అడుగులు గోదావరి వచ్చిన కొన్ని ప్రాంతాలు మునుగుతున్నాయని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.
భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉందని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల వాళ్ళు కుట్రలు చేస్తున్నారని.. గతంలో లేహ్ లో చేశారని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. ఉత్తరాఖండ్ లో ఇలాగే క్లౌడ్ బరస్ట్ చేశారన్నారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఈ నెల ఆఖరు వరకు వర్షాలు ఉన్నాయని.. ప్రమాదం తప్పిందని ఎవరూ అనుకోవద్దని కోరారు సీఎం కేసీఆర్.