రామ్ చరణ్‌ను చూసి భయపడిన రాజమౌళి.. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే?

-

టాలీవుడ్ జక్కన్నగా పేరు గాంచిన రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నటించిన ఇరువురు స్టార్ హీరోలు ఇరగదీశారని సినీ అభిమానులు చెప్తున్నారు. అయితే, మరీ ముఖ్యంగా రామ్ చరణ్ పాత్రలో ఉన్న వేరియేషన్స్ పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, స్నేహితుడిగా, అల్లూరి సీతారామ రాజుగా, మరదలుకు మాటిచ్చిన బావగా ఇలా రామ్ చరణ్ పాత్రలోని వేరియేషన్స్ ఆయన్ను బాగా ఎలివేట్ చేశాయని చెప్పొచ్చు.

ఇకపోతే ఈ చిత్ర షూటింగ్ సందర్భంలో మూవీ సెట్స్ లో చరణ్ ను చూసి తానే భయపడ్డానని రాజమౌళి పేర్కొన్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ లో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసం చెర్రీ తన బ్లడ్ పెట్టి పని చేశాడని చెప్పాడు. ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఒక్క డైలాగ్ లేకుండా కేవలం యాక్షన్ తోనే చరణ్ ప్రేక్షకుల మెప్పు పొందాడు.

షూటింగ్ టైంలో దాదాపు 1,000 మంది ఒక్కసారిగా రామ్ చరణ్ వైపు దూసుకురావడంతో ఆ ఏరియా మొత్తం దుమ్ముతో అల్లుకుపోగా, ఆ డస్ట్‌లో చరణ్ అస్సలు కనిపించలేదని రాజమౌళి చెప్పాడు. అప్పుడు చరణ్ కు ఏమైందని తాను భయపడ్డానని, కానీ, ఆయనకు ఏం జరగకుండా కనీసం ఒక్క గీత కూడా పడకుండా బయటపడ్డాడని చెప్పుకొచ్చాడు దర్శకధీరుడు.

చరణ్ ఇంట్రడక్షన్ సీన్ 15 రోజులు షూట్ చేయగా, దానికి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.600 కోట్ల కలెక్షన్స్ దాటేసింది. ఈ పిక్చర్‌ను డివివి దానయ్య ప్రొడ్యూస్ చేయగా, కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్స్‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్, సీనియర్ హీరోయిన్ శ్రియ, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version