గోషామహల్ నియోజక వర్గం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తారు. ఇప్పటికే గొండు మాసం తినే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కోడలు సానియా మీర్జా మనకొద్దని… మన పీవీ సింధునే బ్రాండ్ అంబాసిడర్ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ దుమారం లేపే వ్యాఖ్యలు చేశారు.
టోక్యో ఒలింపిక్స్ క్రీడా ల్లో పీవీ సింధు కాంస్య పతకం గెలిచిన నేపథ్యం లో ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. తెలుగు మహిళ గా పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ క్రీడాల్లో అద్భుత విజయం సాధించిందని.. ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని రాజాసింగ్ పేర్కొన్నారు. పీవీ సింధు కాంస్య పతకం సాధించడం… భారత దేశం చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. కాగా.. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు కాంస్య పతకం గెలుపొందిన సంగతి తెలిసిందే.