రాజమౌళి గుండెల్లో ప్రభాస్ కు ప్రత్యేక స్థానం..!!

-

ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారుమళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేశారు రాజమౌళి. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మనకంటే దేశంలో ఎక్కువుగా ఆసక్తి వుంది. అలాగే రీసెంట్ గా జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల చేస్తే  వసూళ్ల లోఇండియా దేశ సినిమాల్లో నంబర్ వన్ గా నిలిచింది.

ఇప్పటికే ఆస్కార్‌ బరిలో నిలిచిన ఈ మూవీ అనేక అవార్డులు సాధిస్తోంది.ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకోగా, లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుకు అడుగు దూరంలో ఆగి పోయారు.  ఇక బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎమ్‌ఎమ్‌ కిరవాణి లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు. దీంతో వీరిద్దరికి సినీ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అలాగే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కూడా వీరికి సోషల్‌ మీడియా లో విషెస్ చెప్పాడు.ఈ మేరకు ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. బెస్ట్ డైరెక్టర్‌గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్‌తో పాటు లాస్ ఏంజెల్స్‌ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ డెరెక్టర్ రన్నరప్ పురస్కారాలు అందుకున్నందుకు నా శుభాకాంక్షలు. అలాగే లాస్ ఏంజెల్స్‌ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ గెల్చుకున్న కీరవాణి గారికి కంగ్రాట్స్’ అంటూ ప్రభాస్ పోస్ట్ చేశాడు. ఇక ప్రభాస్ పోస్ట్‌పై రాజమౌళి గారు రిప్లై ఇస్తూ. ”థాంక్స్ డార్లింగ్. నేను ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటానని , నన్ను నేను నమ్మని పరిస్తితిలో  నమ్మిన వ్యక్తి వి నువ్వే” అంటూ ప్రభాస్ ను గుర్తు చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version