ట్రయాంగిల్‌ ఫైట్‌లో రాజమౌళి మాటే నెగ్గిందా

-

రామ్‌చరణ్‌.. చిరంజీవి.. రాజమౌళి. ఈ ట్రయాంగిల్‌ ఫైట్‌లో రాజమౌళీనే గెలిచాడు. ఆయన మాటే నెగ్గింది. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి కాకుండా ఆచార్య షూట్‌లో పాల్గొనే అవకాశం రామ్‌చరణ్‌కు ఇవ్వలేదు జక్కన్న. ఆచార్య కోసం చెర్రీపై ఎన్ని రోజులు షూట్‌ చేస్తారు ఇంతకీ ఈ మెగా తండ్రీకొడుకులు ఎప్పుడు కలిసి వర్క్‌ చేస్తారు అన్నది ఇప్పుడు ఆచర్య యూనిట్ లో ఇంట్రస్టింగ్ గా మారింది.

ఆచార్యలో రామ్‌చరణ్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడు. రెండేళ్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌ తప్ప మరో మూవీలో నటించలేదు. రాజమౌళి దగ్గర పర్మిషన్‌ తీసుకుని.. ఆచార్యను కంప్లీట్‌ చేసేస్తే.. కెరీర్‌ గ్యాప్‌లో పడిపోదన్న ప్లాన్‌లో వున్నాడు చెర్రీ. అయితే.. కరోనా తర్వాత అన్ని సినిమాల కంటే ఆలస్యంగా ఆచార్య షూటింగ్‌ మొదలైంది. కరోనా హాలిడేస్‌లో దర్శకుడు ఆచార్య కథలో మార్పులు చేర్పులు చేశాడు. ఈ క్రమంలో.. రామ్‌చరణ్‌ పాత్ర లెంగ్త్‌ పెరిగింది. రెండు నెలలపాటు పాల్గొంటేగానీ.. ఆయన పాత్ర పూర్తికాదు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మొదలైందో లేదో.. 50 రోజులపాటు నైట్‌ షూట్‌ పూర్తిచేసుకుంది. ఆమధ్య రామ్‌చరణ్‌ జోడీ అలియాభట్‌పై కొన్ని సీన్స్ తీశారు. ఈక్రమంలో ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలన్న పట్టుదలతో రాజమౌళి వున్నాడు. దీంతో.. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తయిన తర్వాతే ఆచార్య షూట్‌లో జాయిన్‌ అవుతాడు చెర్రీ. ఆచార్యలో రామ్‌చరణ్‌ పార్ట్‌ షూట్‌ను ఫిబ్రవరి చివర్లో మొదలుపెట్టి.. రెండు నెలల్లో పూర్తిచేస్తారట. రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ పేరు వినిస్తున్నా.. ఎనౌన్స్ చేయలేదు. ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఆచార్యను మే 7న రిలీజ్‌ చేయాలన్న ప్లాన్‌లో వున్నారు నిర్మాతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version