రజనీ హెల్త్ బులెటిన్ విడుదల.. రాత్రంతా ఇబ్బందిగానే ?

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయనకు హైబీపీ తప్ప మరే సమస్య లేదని చెబుతున్నారు డాక్టర్లు. నిన్న సాయంత్రమే డిశ్చార్జి అవుతారని భావించిన ఆయన హై బీపీ కంట్రోల్ లోకి రాక పోవడంతో ఈ రోజు కూడా ఆసుపత్రిలోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్ది సేపటి క్రితం రజినీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది అపోలో యాజమాన్యం.

అపోలో యాజమాన్యం ఢిల్లీ స్టేషన్ హెల్త్ బులెటిన్ ప్రకారం ప్రస్తుతం రజనీ ఆరోగ్యం నిలకడగానే ఉంది అయినా హైబీపీతో ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. నిన్న రాత్రి కూడా కాస్త ఇబ్బంది కరంగానే ఆయన ఉన్నారని దానిలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా మరికొన్ని పరీక్షలు చేస్తే గాని ఈ సమస్యకు సంబంధించి పూర్తి అవగాహనకు రాలేమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. వైద్యపరీక్షల్లో అన్ని బాగానే ఉంటే ఈరోజు సాయంత్రం డిస్చార్జ్ చేస్తామని బులెటిన్ లో పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version