రాజస్థాన్ సీఎం కు హై కోర్ట్ నోటీసులు … !

-

రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మంచి పధకాలను తీసుకువస్తూ సుపరిపాలన అందించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. కాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షానికి ఎప్పటికప్పుడు షాకులు ఇస్తున్నాడు. తాజాగా అశోక్ గెహ్లాట్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు, మాములుగా రాజకీయ నాయకుల మధ్యన ఏవేవో ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు నోర్లు మారడం చూస్తుంటాము. కానీ అశోక్ గెహ్లాట్ ఈ మధ్యనే కోర్ట్ ల్లో అవినీతి బాగా పెరిగిపోయిందంటూ చేసిన వ్యాఖ్యల గురించి రాష్ట్ర హై కోర్ట్ సీరియస్ అయింది. ఇంకా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ… కొందరు లాయర్లు తీర్పును వీరే రెడీ చేసి జడ్జి లకు అందిస్తున్నారు, అందుకు తగిన విధంగానే కోర్ట్ లు తీర్పు ఇస్తున్నారు అనడం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశం అయింది.

ఇందుకు ఒక న్యాయమూర్తి కోర్ట్ ఈ కేసును సుమోటాగా తీసుకుని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిల్ వేశారు.. ఈ విషయంపడు హై కోర్ట్ సీఎం కు షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుపై మూడు వరాళ్లలో తగిన వివరణ ఇవ్వాలని హై కోర్ట్ ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news