నిజమైన ప్రేమ అంటే ఇదే..అబ్బాయిగా మారి చివరికి..

-

ప్రేమ గుడ్డిది.. పిచ్చిది..ఒకసారి ప్రేమలో పడితే ఏదైనా చేస్తారు.ఎంతకైనా తెగిస్తారు అని ఇది వరకే చాలా మంది నిరూపించారు.. కానీ ఇప్పుడు విచిత్ర ఘటన ఒకటి వెలుగు చూసింది.. తన ప్రేమను ఎలాగైనా గెలుచుకోవాలని అబ్బాయిగా మారిన టీచర్ గాధ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఓ స్కూల్లో పీఈటీగా పనిచేసే టీచర్‌ అదే స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధిని తో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి ప్రేమాయణంలో అసలు ట్విస్ట్‌.. ఇద్దరూ ఆడవాళ్లే అవ్వడం. దీంతో టీచర్‌ లింగమార్పిడి ద్వారా పురుషుడిగా మారి శిష్యురాలిని వివాహం చేసుకుని తమ ప్రేమను గెలిపించుకున్నారు..వివరాల్లొకి వెళితే..

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మీరా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (పీఈటీ) గా పనిచేసేవారు. ఐతే కబడ్డీ ప్లేయర్‌ అయిన కల్పన ఫౌజ్‌దర్‌ అనే స్టూడెంట్‌ దుబాయ్‌లో నిర్వహించిన ఇంటర్నేషన్‌ కబడ్డీ టోర్నమెంట్‌కు వెళ్లింది. ఇదే సమయం లో మీరాకు కల్పన పరిచయం అయ్యింది. వీరి పరిచయం కాస్తా అనతికాలంలోనే ప్రేమగా మారింది. ఐతే కల్పన పరిచయమైనప్పటి నుంచి తాను అమ్మాయిగా ఎందుకు పుట్టానా? అని బాధపడేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా మీరా అబ్బాయిగా మారాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2019 డిసెంబర్‌ 25న తొలిసారి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నారు. పలు దఫాల తర్వాత.. 2021 డిసెంబర్‌లో శస్త్రచికిత్స పూర్తైంది. ఆ తర్వాత తన పేరును ఆరవ్‌ కుంతల్‌గా మార్చుకున్నారు. దీంతో ఇరువురి కుటుంబాల అంగీకారంతో ఆదివారం (నవంబర్‌ 6) అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.. అంతేకాదు.. ఉద్యోగ డాక్యుమెంట్ల లో జండర్‌ మర్చుకోవడానికి చాలా కష్టపడ్డానని’ ఆరవ్‌ తెలిపారు.. ఏది ఏమైనా ఇలా చెయ్యడానికి దైర్యం కూడా కావాలి..గ్రేట్ అంతే..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version