ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఇంట్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి, సుమ ఆడపడుచు అయిన శ్రీలక్ష్మీ ఈ రోజు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రముఖ నటుడు దేవదాసు, లక్ష్మీ కనకాలల ఏకైక కూతురు ఆమె. ఆమె మరణంతో ఇప్పుడు సుమా ఇంట్లో విషాదం నెలకొంది. శ్రీలక్ష్మి భర్త ప్రముఖ జర్నలిస్టు పెద్ద రామారావు.
గత యేడాది ఆగష్టులో రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటులు దేవదాసు కనకాల కన్ను మూయగా రెండేళ్ల క్రితం దేవదాసు కనకాల భార్య లక్ష్మీ కనకాల మృతి చెందారు. ఇలా రెండేళ్ళు తిరగకుండానే ఆ కుటుంబాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రాజీవ్ కనకాల ఈ మరణాలతో ఎక్కువగా కుంగిపోయారని అంటున్నారు. మూడో మరణం చోటు చేసుకోవడంతో పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణంతో టాలీవుడ్ కూడా షాక్ అయింది. పలువురు సినీ ప్రముఖులు రాజీవ్‌కు ఫోన్ చేసి తమ సంతాపం ప్రకటిస్తున్నారు.