కష్టాల్లో ఉన్న రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్క్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న హామీలను అమలు చేయకపోగా రైతులని విస్తరిత ఇష్టారీతిగా అవమానాలకి గురి చేస్తున్నారని అన్నారు రైతుబంధు విడుదల్లో జాతీయ కరెంటు కోతలు దాన్ని 500 బోనస్ హామీ ఇచ్చి విస్మరించడమే కాకుండా కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.