50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన సూపర్ స్టార్ రజినీ..

-

కరోనా వైరస్ ప్రభావంతో సిని ఇండస్ట్రీ మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసేందే.. ఇప్పటికే సినిమా ధియేటర్లు, షూటింగులు నిలిపివేయడంతో సామాన్య సినిమా కార్మికులంతా రోడ్డుపై పడే పరిస్థితి వచ్చింది. పనులు లేక డబ్బులు చాలక వారంతా అనేక కష్టాలు పడుతున్నారు. వారి కష్టాలను గుర్తించి ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.

తాజాగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘానికి సూపర్ స్టార్ రజినీ కాంత్ రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. చిత్రీకరణ అంటే వందల మందితో కూడుకున్న వ్యవహారం కావడంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో రజినీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది… అలాగే కోలివుడ్ చెందిన మరో హీరో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా తన వంతు సాయంగా రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించాడు..

సంఘంలో 25 వేల మంది కళాకారులు సభ్యులుగా ఉన్నారని వారిలో 15 వేల మంది కనీసం నిత్యావసర సరుకులు కొనేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆ సంఘానికి ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి మీడియాకు తెలిపారు. సినీ ప్రముఖులంతా కలిపి తమ వంతు సాయం అందించాలని కోరారు. దీంతో హీరో సూర్య, కార్తి వారి తండ్రి శివకుమార్ కలిసి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version