గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహన్ని ఏర్పాటు చేసింది. అయితే, స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని ప్రముఖ తెలుగు క్రికెట్ అనలస్ట్ సి.వెంకటేష్ తీవ్రంగా వ్యతిరేకించారు.
హైదరాబాద్ క్రికెట్‌కు రాజీవ్ గాంధీకి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు ఉండగా.. మళ్లీ విగ్రహం పెట్టి నొక్కి వక్కాణించాలా? అని సి.వెంకటేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.