RRR’ సినిమాపై ప్రశంసలు కురిపించిన రాజ్యసభ

-

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల రెండోరోజు కూడా లోక్​సభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కాసేపటికే దుమారం రేగడంతో.. వాయిదా పడింది. అదానీ- హిండెన్​బర్గ్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టగా.. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార పక్ష ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో లోక్​సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.

మరోవైపు, రాజ్యసభలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భారత్​కు ఆస్కార్ అవార్డులు సాధించి పెట్టిన ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర బృందాలకు పెద్దల సభ ఎంపీలు అభినందనలు తెలియజేశారు. ఆస్కార్ అవార్డులు రావడం.. దేశంలో ఉన్న ప్రతిభకు అంతర్జాతీయంగా దక్కిన గొప్ప ప్రశంస అని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్​ఖడ్ పేర్కొన్నారు. ప్రపంచంలో భారతదేశానికి మరో గుర్తింపు లభించినట్లయిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version