తెలంగాణలో మళ్లీ అత్యధికంగా పెరిగిన విద్యుత్ వినియోగం

-

తెలంగాణలో మళ్లీ అత్యధికంగా పెరిగింది విద్యుత్ వినియోగం. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయిందని.. ఇవాళ ఉదయం 10.3 నిమిషాలకు 15062 మెగావాట్ల విద్యుత్ అత్యధిక ఫీక్ డిమాండ్ నమోదు ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగం జరిగినట్లు తెలిపారు ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగం పెరుగుతుందని.. సాగు విస్తీర్ణం పెరగడం,రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుందని వివరించారు ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.

మొత్తం విద్యుత్ వినియోగం లో 37 శాతం వ్యవసాయ రంగంకేనని.. దేశంలో వ్యవసాయ రంగంకు అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా రెండో స్థానంలో తెలంగాణ అని.. నిన్న 14138 మెగావాట్లు కాగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15062 మెగా వాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు ఇదేనని చెప్పారు. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్ ను అధిగమించి ఈనెలలోనే 14750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి 15062 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదు అయింది…ఈ సంవత్సరం వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఎంత డిమాండ్ వచ్చిన సరఫరాకు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ప్రకటించారు ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version