దేశ వ్యాప్తంగా కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి..అనేక వివాదాల మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదం పొందాయి..రాష్ట్రపతి ఆమోదంతో బిల్లులు చట్టాలుగా మారాయి..దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు అగ్రి చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.పంజాబ్ హార్యానా రాష్ట్రాల్లో రైతులు గత 14 రోజులగా ఆందోళనలు చేస్తున్నారు..అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..తాజా కొత్త వ్యవసాయ చట్టాలు రైతులను బానిసలుగా తయారు చేసేవిగా ఉన్నాయని వాటిని వెన్నిక్కి తీసుకోవాలని సీపీఐ రాజ్యసభ ఎంపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..ఈ చట్టాలు ‘రాజ్యాంగ విరుద్ధమని మూడు వ్యవసాయ బిల్లులను కొట్టాలని’ కోరుతూ రాజ్యసభ ఎంపి బినాయ్ విశ్వం రిట్ పిటిషన్‌లో కోరారు..