నా మీద రేప్ కేసు ఉంది, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి ప్లీజ్…!

-

ఎన్నికల ప్రచారం అనగానే ఎలా చేస్తారు…? మీకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా, నా ఆస్తులు అమ్మి అయినా మీకు సేవ చేస్తా, నా కోసం ఓట్లు వేస్తే మీ కోసం ప్రాణాలు ఇస్తా అంటూ ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటారు. ప్రజలను మభ్య పెట్టి ఎలా అయినా సరే విజయం సాధించడానికి తీవ్రంగా కష్టపడతారు. తమ మీద విపక్షాలు, ప్రత్యర్ధులు అవినీతి, అక్రమాల ఆరోపణలు చేసినా సరే అవి అన్ని ఉత్తిత్తే అంటూ ఉంటారు. కాని బీహార్ లో మాత్రం ఇందుకు భిన్నంగా ప్రచారం చేస్తున్నాడు ఒక ఎమ్మెల్యే అభ్యర్ధి.

“నా పేరు రాజేంద్ర ప్రసాద్. నాది… నలందా జిల్లా బర్బీఘా అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అయితే మీరు ఒకటి తెలుసుకోవాలి. నేను కేవలం డబ్బు సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చా గాని ప్రజా సేవ చేయాలని నాకు లేదు. ఇంతకాలం పాటు దర్జీగా పనిచేస్తూ జీవనం సాగించా… చాలా కష్టపడ్డాను కాని ఇప్పటి వరకు ఏమీ సంపాదించలేకపోయాను. ఎప్పటికైనా కోటీశ్వరుడిని కావాలనేది నా కల. అందుకు రాజకీయం ఒక్కటే మార్గం అని నిర్ణయంతీసుకున్నా.

అభివృద్ధి పేరిట దోపిడీ చేసి కొంత డబ్బు సంపాదించుకుంటాను. దయచేసి నాకు ఓట్లేసి గెలిపించండి చాలు.” అంటూ సదరు ఎమ్మెల్యే అభ్యర్ధి ఓట్లు అడిగారు. అంతే కాదు మరి… “నా మీద ఇప్పటికే పోలీస్ స్టేషన్లో రెండు కూడా కేసులున్నాయి. మొదటిది భూవివాదం కేసు రెండోది అత్యాచారం కేసు. రాజకీయాల్లోకి రావాలంటే ఇవే అర్హతలు” అంటూ అతను ప్రజల్లోకి వెళ్ళాడు. మరి అతను కావాలని చెప్పాడా లేక అతను తన ఉద్దేశాన్ని బయటపెట్టాడా అనేది అర్ధం కావడం లేదని అంటున్నారు అక్కడి ప్రజలు. కాని ఈ తరహా ప్రచార శైలి మాత్రం దేశ రాజకీయాల్లోనే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version