వర్షాకాల సమావేశాలలో భాగంగా పార్లమెంట్ రాజ్యసభ లతో ఎంపీలు అంతా బాగా బిజీగా ఉన్నారు. కాగా ఈ రోజు రాజ్యసభ లో ఒక హాస్యం కు సంబంధించిన సంఘటన జరిగింది. చర్చలలో భాగంగా సభ్యులు కొంచెం ఆవేశపడడం జరుగుతూ ఉంటుంది. ఇక సభను ఆర్డర్ లో పెట్టాల్సిన బాధ్యత కూడా చైర్మన్ పై ఉంటుంది కాబట్టి పరస్పరం గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్ పై ఒక ఆరోపణ చేశారు. సభ జరుగుతున్న సమయంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ మాపై కోపంగా ఉన్నారని చెప్పారు ఖర్గే. అయితే ఈ ఆరోపణపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ ఇప్పటికి నాకు పెళ్లి అయ్యి 45 సంవత్సరాలు అవుతోంది, ఇప్పటి వరకు ఎవరిపైన నేను కోపాన్ని ప్రదర్శించలేదు అంటూ చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలతో సభలో అందరూ పక్కున నవ్వుకున్నారు. వెంటనే ఖర్గే మీరు పైకి కోపంగా మాట్లాడకపోయినా లోలోపల మాపై కోపంతో ఉన్నారన్నారు.