తన పెళ్లి వార్తలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు రకుల్.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు తన  గ్లామర్ తో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది.  ముఖ్యంగా బాడీ ఫిట్నెస్ తో ఎప్పటికప్పుడు ఉర్రూతలూగించే ఈ ముద్దుగుమ్మ తన జిమ్ వర్కౌట్స్ తో విన్యాసాలు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా గత ఏడాది ప్రముఖ బాలీవుడ్ నటుడు,  నిర్మాత అయిన జాకీభగ్నానితో ప్రేమలో పడిందనే విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.  ఆ తర్వాత వీరిద్దరూ చట్టా పట్టాలేసుకొని చాలాసార్లు మీడియా ముందు తిరిగారు.
వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే గత ఏడాది ఏకంగా ఊహించని విధంగా నవంబర్లోనే ఆమె పెళ్లి జరిగిపోయింది అంటూ వార్తలు వైరల్ చేయడం గమనార్హం. అయితే ఈ విషయంపై తాజాగా రకుల్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.. ఇకపోతే గతంలో కూడా రకుల్ తమ్ముడు అయాన్ కూడా రకుల్ పెళ్లికి సిద్ధమయ్యింది అంటూ సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించడంతో ఈ పుకార్లకు మరింత జోరు పెరిగింది.. నవంబర్లో పెళ్లి చేసుకోబోతోందని గత ఏడాది అక్టోబర్లో ఒక్కసారిగా వార్తలు గొప్ప మన్నాయి.
ఈ విషయంపై రకుల్ స్పందిస్తూ.. అది గూగుల్ అలర్ట్ లో వస్తుంది.. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రతి వారం నా గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది ..ఈ వార్తల ప్రకారం నవంబర్లోనే నేను పెళ్లి చేసుకున్నాను.. అసలు నా పెళ్లి ఎలా జరిగిందో మాత్రం ఎవరూ చెప్పలేదు ప్రస్తుతం నా ధ్యాసంతా నటించడం పైనే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version