మెగా అభిమానులు సర్ప్రైజ్ అయ్యే అప్డేట్ తో రాబోతున్న రామ్ చరణ్.!

-

రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.అయితే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి నెలలు గడుస్తోంది. కాని ఇప్పటి వరకూ ఈమూవీ నుంచి ఫ్యాన్స్ కోసం ఏ అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో మెగా అభిమానులు చిత్రబృందంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.త్వరలో కొత్త సంవత్సరం రోజున  ఈసినిమా నుంచి  అప్ డేట్ ఇవ్వబోతున్నారు  తెలుస్తోంది టీమ్. మెగా అభిమానుల అభ్యర్థన మేరకు రామ్‌చరణ్‌ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. అంతేకాకుండా ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ను కూడా ప్లాన్‌ చేస్తుంన్నారట టీమ్. త్వరలోనే దీనికి సబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక మూవీ ఎప్పటి నుండో RC15 అనే వర్కింగ్ టైటిల్ తో  షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా కు  సర్కారోడు  లేదా పబ్లిక్ సర్వెంట్ అనే టైటిల్లు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. పరిశీలనలో ఉండగా.. ఈమూవీలో రామ్‌చరణ్‌ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈసినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.మరో హీరోయిన్ అంజలి కూడా ఈమూవీలో  నటిస్తున్నారు. వీరితో పాటు సునీల్‌, దర్శకుడు ఎస్‌.జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version