ఏంటమ్మా సాంగ్ టీజర్ రిలీజ్.. వెంకీ, సల్మాన్‌లతో రామ్ చరణ్ లుంగీ డ్యాన్స్

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్‌లో ఇప్పటికే పలు సినిమాల్లో క్యామియో రోల్స్ చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో పాటల్లో కాసేపు కనిపించి సందడి చేశారు. అయితే తాజాగా రామ్ చరణ్ బాలీవుడ్ మూవీలోని కనిపించారు. బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా నుంచి ఏంటమ్మా అనే పాట వీడియో రిలీజ్ అయింది. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.

ఈ పాటలో విక్టరీ వెంకటేశ్, సల్మాన్ ఖాన్‌తో కలిసి రామ్ చరణ్ స్టెప్పులేశారు. లుంగీ కాస్ట్యూమ్‌లో లుంగీ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పూజా హెగ్డే సల్మాన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్ 21న థియేటర్లలోకి సినిమా రానుంది. ఈ వీడియో సాంగ్‌పై రామ్ చరణ్ స్పందించాడు. ఆన్‌స్క్రీన్‌పై విలువైన సీన్లలో ఇదొకటి అంటూ ఈ పాటను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వెంకటేశ్, సల్మాన్ ఖాన్‌లతో డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news