తండ్రి బాటలో రామ్ చరణ్.. ఫస్ట్ ట్వీట్‌తోనే ఫిదా చేసేశాడు!

-

ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన మొదటి రోజే చిరు తన సత్తాను చాటాడు .వరుస ట్వీట్లతో హల్చల్ చేశాడు. మొదటి ట్వీట్‌లో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చిరు, రెండో ట్వీట్‌లో కరోనా కట్టడికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపాడు.

రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ తీసుకునే నిర్ణయాలకు ప్రజలంతా సహకరించాలని, ప్రజలంతా ఈ 21 రోజలు ఇంటి పట్టునే ఉండాలని కోరాడు. ట్విట్టర్‌లో ఇలా దూకుడు పెంచిన చిరు.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్‌లు చేయడం ప్రారంభించాడు. అమ్మ అంజనాదేవీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఇలాంటి క్లిష్ట సమయంలో అమ్మనాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలని హోమ్ టైమ్.. మామ్ టైమ్ అంటూ పోస్ట్ చేశాడు.

తాజాగా రామ్ చరణ్ కూడా ట్విట్టర్ ప్రపంచలోకి ఎంట్రీ ఇచ్చాడు. రామ్ చరణ్ చేసిన ఫస్ట్ ట్వీట్‌తోనే అందరూ ఫిదా అయ్యారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలకు సాయం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని తాను 70లక్షలు విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version