వెంకీ “నారప్ప” పరిస్థితేంటి ఇలా అయిపోయింది .. రాంగ్ స్టెప్ వేశారా …?

-

విక్టరీ వెంకటేష్ తో పాటు ఆయన అన్నయ్య సురేష్ బాబు కూడా ఎప్పుడు ప్రయోగాలు చేయడానికి ముందుంటారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు మన వెంకటేష్ రీమేక్ కింగ్ అన్న పేరు కూడా ఉంది. అందుకు కారణం కోలీవుడ్ అలాగే బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన సినిమాలని వెంకటేష్ రీమేక్ చేసి బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు. వెంకటేష్ తో ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసింది సూపర్ గుడ్ ఫిలింస్ అలాగే సూరేష్ ప్రొడక్షన్స్. రాజా, సూర్యవంశం, చంటి, శీను, వసంతం, మసాలా, బాడీగార్డ్, గోపాల గోపాల, గురు … ఇలా చెప్పుకుంటు పోతే వెంకీ చేసిన రీమేక్ బ్లాక్ బస్టర్స్ చాలానే ఉన్నాయి. అదే తరహాలో మరో సూపర్ హిట్ రీమేక్ లో నటిస్తున్నారు.

 

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ అన్న టైటిల్ తో వెంకటేష్ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారప్ప ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాదు ఇండస్ట్రీలో ఈ లుక్ హాట్ టాపిక్ కూడా అయింది. ఇక ఈ సినిమాను తమిళ సినిమా ‘అసురన్’కు అఫీషియల్ రీమేక్‌గా సురేష్ బాబు నిర్మిస్తున్నారు. తమిళంలో ధనుష్ నటించిన ఈ కంప్లీట్ కల్ట్ కంటెంట్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకుంది. అంతేకాదు ఇప్పటి వరకు ధనుష్ నటించిన సినిమాలలోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియోట్ చేసింది.

 

తమిళ వెర్షన్ కి వెట్రిమారన్ దర్శకత్వం వహించగా దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సెన్షేషనల్ హిట్ గా నిలిచింది. అందుకే ఈ సినిమాని సురేష్ బాబు తెలుగులో రీమేక్ చేయాలని డిసైడయ్యాడు. ఇక తెలుగులో వెంకటేష్ కి జంటగా ప్రియమణి నటిస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైంది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. వాస్తవంగా ఈ సినిమాని సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేశారు. కాని కారోనా కారణంగా ఇప్పటి వరకు షూటింగ్ కంప్లీటవనేలేదు.

ఇక సమ్మర్ కి రిలీజ్ అంటే అసాధ్యమే. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే తమిళ వెర్షన్ ని అమోజాన్ లో చూసేశారు. అయినా ఈ సినిమా రీమేక్ చేయడం కూడా పెద్ద సాహసం. ఇక ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా చూసిన సినిమాని మళ్ళీ చూసే ఇంట్రెస్ట్ ప్రేక్షకులను ఉందడని టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ సినిమా కమిటయి హీరో, ప్రొడ్యూసర్ రాంగ్ స్టెప్ వేశారా అంటూ చర్చించుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version