బిహార్ లో NDA సర్కార్.. సీఎంగా నీతీశ్.. డిప్యూటీలుగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం

-

బిహార్లో మహాకూటమిని వీడి సీఎం పదవికి జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నీతీశ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనుండగా.. బీజేపీకి నుంచి ఇద్దరు నేతలు డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారని ఆ పార్టీ వర్గాల సమాచారం.

నీతీశ్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎమ్, ఒక స్వతంత్య్ర అభ్యర్థి.. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి, మరో బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాను.. లెజిస్లేటివ్ పార్టీ నేత, డిప్యూటీ నేతగా ఎన్నుకోగా వీరిద్దరే ఉపముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇతర నేతలు నితిన్ నబిన్, శంష్నావాజ్ హుస్సేన్, రామ్ప్రీత్ పాసవాన్‌, నీరజ్ సింగ్ బబ్లూను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news