చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..ఛీఫ్ గెస్ట్ గా బాలీవుడ్ హీరో..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ‌స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ తో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ సీ 15 పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌న్న ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల8 నుండి ప్రారంభం కానుంది.

అయితే దీనిపై అఫీయ‌ల్ అనౌన్స్ మెంట్ ఇప్ప‌టివ‌ర‌కూ రాలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌ ముహూర్తం కు బాలీవుడ్ యంగ్ హీరో ర‌ణ్ వీర్ సింగ్ మ‌రియు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కూడా అతిధులుగా హాజ‌రుకాబోతున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఎన్టీఆర్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి రాబోతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఈసినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా…శ్రీ వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.