RC15 నుంచి రామ్ చరణ్ లుక్ లీక్..!

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..RRR ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ పైన ఇంకా ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. విలక్షణ నటుడు, డైరెక్టర్ ఎస్.జే.సూర్య ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, అంజలి, సునీల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఆల్మోస్ట్ చాలా షూటింగ్ కంప్లీట్ చేసేసిన దర్శకుడు శంకర్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ ని అయితే స్టార్ట్ చేశారు. మరి ఈ షూట్ కోసం అయితే రామ్ చరణ్ మళ్ళీ తన లుక్ ని మార్చగా ఇప్పుడు తాజాగా తాను షేర్ చేసుకున్నావో పిక్ ఆసక్తిగా మారింది. తాను ఎంతో అమితంగా ప్రేమించే కుక్కపిల్ల రైమ్ ని తన జాకెట్ లో పెట్టుకొని చరణ్ అయితే షేర్ చేసిన ఈ ఫోటో బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే దీనితోనే ఈ సినిమాకి ఏ లుక్ లో హాజరు అవుతున్నాడో కూడా అభిమానులకి మంచి క్లారిటీ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version